Friday, December 27, 2024

రాచకొండలో నలుగురు ఇన్స్‌స్పెక్టర్ల బదిలీలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న నలుగురు ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్ ఇన్స్‌స్పెక్టర్ శ్రావణ్‌కుమార్, వనస్థలిపురం ఇన్స్‌స్పెక్టర్ జలంధర్‌రెడ్డి, నేరెడ్‌మెట్ ఎస్‌హెచ్‌ఓ శివకుమార్, కుషాయిగూడ ఇన్స్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను బదిలీ చేశారు. నలుగురు ఇన్స్‌స్పెక్టర్లను మల్టీ జోన్ 2కు సరెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్ ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న గోవింద్ రెడ్డి అకస్మాత్తుగా బదిలీ చేసి ఎన్నికల ముందు శ్రావణ్‌కుమార్‌ను నియమించారు. ఉప్పుల్ ఇన్స్‌స్పెక్టర్‌గా శ్రావణ్‌కుమార్ నియామకం వివాదాస్పదమైంది. తాజాగా నలుగురిని బదిలీ చేయడమే కాకుండా రేంజ్‌కు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News