Sunday, January 19, 2025

తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి బదిలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి బదిలీ అయ్యారు. ఆమెను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. దీనికి సంబంధించిన సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. బదిలీ ఉత్త ర్వులను జారీ చేసింది. జస్టిస్ కన్నెగంటి లలిత కుమారితో పాటు మరో ఇద్దరు వేర్వేరు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను కూడా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. గతంలో ఆమె ఎపి హైకోర్టులో పని చేశారు. అనంతరం తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

ఇక తాజాగా కర్ణాటకకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆయన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తరువాత న్యాయమూర్తులను బదిలీలను ఆమోదించినట్లు చెప్పారు. ఎపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలీలు కూడా బదిలీ అయ్యారు. జస్టిస్ డి రమేష్‌ను ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేశారు. జస్టిస్ విపుల్ పంచోలీని పాట్నా హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ విపుల్ పంచోలీ బదిలీ పట్ల కొంత వ్యతిరేకత ఎదురైంది. ఆయనను బదిలీ చేయడాన్ని గుజరాత్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అభ్యంతరం తెలిపింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఆయన బదిలీని నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గుజరాత్ హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌కు మూడు పేజీల వినతిపత్రాన్ని అందించింది ఇదివరకు. అనుభవజ్ఞుడైన న్యాయమూర్తిని గుజరాత్ నుంచి బదిలీ చేయడం సరికాదని, దీనివల్ల రాష్ట్రంలోని న్యాయ పరిపాలన వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News