Monday, December 23, 2024

ఎన్నికల ప్రక్రియ షురూ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ, పోలీసు అధికారులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆరు నెలలో శాసనసభ ఎన్నికలు జరిగే మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రా ష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను శుక్రవారం ఆదేశించింది. ఈ బదిలీల ప్రక్రియను జూలై 31 లోగా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కోరింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాల్లో పే ర్కొంది. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్లకు సొంత జిల్లా లో పోస్టింగ్ ఇవ్వొద్దని సూచించింది. ఎన్నికల వి ధుల్లో పాల్గొనే అధికారులకు స్థానికంగా పోటీ చే స్తోన్న అభ్యర్థులతో బంధుత్వాలు లేవని వారి నుం చిధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

ఒకే ప్రాంతంలో మూడేళ్ల పదవీ కాలం పూర్తిచేసిన ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. ఎన్నికల తో సంబంధం లేని వైద్యులు,ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, తదితర ఉద్యోగులపై నిర్దిష్ట ఫిర్యాదులు ఉంటే బదిలీ చేయాలని ఆదేశించాలని సూచించా రు. ఈ ఏడాది డిసెంబర్‌లో మిజోరం, 2024 జనవరి నెలలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభలకు సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అయిదు రా ష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పలు సూచనలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News