Sunday, December 22, 2024

రాచకొండలో పోలీసుల బదిలీ..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న నలుగురు ఇన్స్‌స్పెక్టర్లు, ఏడుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పహాడీషరీఫ్ ఎస్‌హెచ్‌గా పనిచేసిన కిరణ్‌కుమార్‌ను మీర్‌పేట ఎన్‌హెచ్‌ఓగా, పహీడీషరీప్ డిఐగా పనిచేస్తున్న కాశీవిశ్వనాథ్‌ను మంచాల ఇన్స్‌స్పెక్టర్‌గా, మీర్‌పేట్ ఇన్స్‌స్పెక్టర్ మహేందర్‌రెడ్డిని ఘట్‌కేసర్ ఎస్‌హెచ్‌ఓగా,

ఘట్‌కేసర్ ఇన్స్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డిని పోచారం ఐటి కారిడార్ ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేశారు. ఎస్సైలు శ్రీనివాస్‌ను ఆదిబట్ల, నాగార్జునరెడ్డిని నాగోల్‌కు, శ్రీనును వనస్థలిపురం ట్రాఫిక్, శ్రీనివాస్‌ను నాగోల్, వెంకటేష్‌ను ఆదిబట్ల, డి. వెంకటేష్‌ను కీసర, జగన్‌రెడ్డిని వనస్థలిపురం ట్రాఫిక్ పిఎస్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే వారి స్థానాల్లో చేరాలని సిపి డిఎస్ చౌహాన్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News