Thursday, January 23, 2025

సహారా డిపాజిటర్ల ఖాతాల్లో సొమ్ము జమ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌నకు చెందిన నాలుగు కోపరేటివ్ సొసైటీల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును తిరిగి ఇచ్చే ప్రక్రియను కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు కేంద్రం ఏర్పాటు చేసిన సహారా రిఫండ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారిలో 112 మంది డిపాజిటర్లకు తొలి విడతలో భాగంగా రూ. 10 వేల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు ఈ పోర్టల్ ద్వారా 18 లక్షల మంది రిఫండ్ కోసం నమోదు చేసుకున్నారు.

సహారాకు చెందిన నాలుగు కోపరేటివ్ సొసైటీల్లో డబ్బు పోగొట్టుకున్న డిపాజిటర్లకు తిరిగి ఆ సొమ్ము ఇవ్వాలని ప్రధాని మోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా అమిత్ షా తెలిపారు. కోపరేటివ్‌ల లక్ష్యాన్ని బలోపేతం చేయాలంటే.. వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం దేశ ప్రజలు కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్మును కాపాడటం ప్రభుత్వం బాధ్యత అని షా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో డిపాజిటర్లు క్లెయిమ్ చేసిన మొత్తం నగదును పొందుతారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News