Monday, December 23, 2024

సైబరాబాద్‌లో భారీగా ఎస్సైల బదిలీలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర గురువారం ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో జిల్లాల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎస్సైలను వేరే జిల్లాకు బదిలీ చేశారు. మొత్తం 82మంది ఎస్సైలను బదిలీ చేశారు. ఇందులో పలువురు ఎస్సైలు గత ఎన్నికల సమయంలో పనిచేసిన పోలీస్ స్టేషన్ల నుంచి బదిలీ చేశారు. ట్రాన్స్‌ఫర్ అయిన ఎస్సైలు వెంటనే వారి స్థానాల్లో చేరాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News