సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల హైకోర్టులకు చెందిన ఆరుగురు న్యాయమూర్తుల బదలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్‌తో కూడిన ముగ్గురు సభ్యుల కొలీజియం ఆరుగురు న్యాయమూర్తుల బదలీలకు సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాను పాట్నా హైకోర్టుకు, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పురుషేంద్ర కుమార్ గౌరవ్‌ను ఢిల్లీ హైకోర్టుకు, ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిత్త రంజన్ దాస్ కలకత్తా హైకోర్టుకు, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాసిస్ తలపత్ర ఒరిస్సా హైకోర్టుకు, మణిపూర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లానుసుంగ్‌కుమ్ జమీర్ గౌహతి హైకోర్టుకు, జమ్మూ కశ్మీర్, లడఖ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బొంబాయి హైకోర్టుకు బదలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.