Saturday, December 21, 2024

పది మంది ఎడిసిపిల బదిలీ

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: ఇటీవలే పదోన్నతి పొందిన ఎఎస్పిలకు పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర హోం సెక్రటరీ శనివారం ఆదేశాలు జారీ చేశారు. పదిమంది ఎఎస్పిలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. వెయింటింగ్‌లో ఉన్న బి. కోటేశ్వరరావును ఎడిసిపి ఎల్‌బి నగర్‌కు సయిద్ రఫీక్‌ను రాచకొండ ఎస్‌బి ఎడిసిపిగా, పులిచింతల శ్రీనివాస్ రెడ్డిని జిహెచ్‌ఎంసి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగానికి, సురేందర్‌రెడ్డిని డిజిపి ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు, సిసిఎస్ ఎడిసిపిగా ఉన్న ఎన్.మహేందర్‌ను సిఐడికి, ఎండి ఫజలూర్ రెహ్మన్‌ను విజిలెన్స్‌కు, సురేందర్‌రావును విజిలెన్స్‌కు, ఆనంద్‌ను హైదరాబాద్ సిటిసి ఎడిసిపిగా, ఎండి ఇక్బాల్ సిద్ధిఖీని ఎడిసిపి సైబరాబాద్ మేచ్చెల్‌కు, శ్యాంబాబును ట్రాన్స్‌కోలో నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News