Monday, December 23, 2024

సైబరాబాద్‌లో ఇద్దరు ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

మోకిలా, మొయినాబాద్

మనతెలంగాణ, సిటిబ్యూరోః విధి నిర్వహణలో అవినీతికి పాల్పడుతున్న ఇద్దరు ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరిని కమిషనరేట్ నుంచి రేంజ్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మోకిలా ఇన్స్‌స్పెక్టర్‌గా నరేష్, మొయినాబాద్ ఇన్స్‌స్పెక్టర్‌గా ఎవి రంగ పనిచేస్తున్నారు. ఇద్దరు ఇన్స్‌స్పెక్టర్లు అవినీతికి పాల్పడుతున్నారని గత కొంత కాలం నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ చేసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ఆరోపణలు నిజమని తేలడంతో ఇద్దరిని బదిలీ చేసి, రేంజ్‌కు పంపించారు. గతంలో కెపిహెచ్‌బి ఇన్స్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, మియాపూర్ ఎస్సై గిరిధర్ కుమార్ రావును సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News