Sunday, January 19, 2025

27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఈ నెల 27 నుంచి ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని టీచర్ల పదోన్నతులు, బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించి మంత్రి బషీర్‌బాగ్‌లోని తన ఛాంబర్‌లో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ నెల 27న దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని దీనిని పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News