Monday, December 23, 2024

టీచర్లకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి

- Advertisement -
- Advertisement -
  • ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్

రంగారెడ్డి: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తక్షణమే చేపట్టాలని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ డిమాం డ్ చేశారు. ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎస్.పాండు రంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి బదిలీలు, పదోన్నతులు లేక ఉపాధ్యాయులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

కోర్టు పరిథిలో ఉన్నకేసులను సత్వరం పరిష్కరించి బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికై ఉద్యమ కార్యచరణ ప్రకటించడానికి ఎస్టీయూ సిద్ధ ంగా వుందని ఉపాధ్యాయులు సన్నద్ధం కావాలని కోరారు.విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్న సందర్భంగా విద్యా వాలంటీర్లను నియమించాలని కోరారు.

శాశ్వత పరిష్కారానికి టిఆర్టి ప్ర కటించాలని డిమాండ్ చేశారు. పిఆర్‌సి గడువు పూర్తయినందున వెంటనే పిఆ ర్సి కమిషన్‌ను వేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపియస్ విధానాన్ని రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టపాక ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఏ.వి.సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. శ్రీనివాస రావు, రాష్ట్ర కార్యదర్శి శంకర్ మాతంగి జిల్లా ఉపాధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News