Tuesday, December 24, 2024

నిబంధనలకు వ్యతిరేకంగా స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖలో తాజాగా జరిగిన బదిలీలు నిబంధనలకు వ్యతిరేకంగా జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్‌లను గ్రేడ్ 1 సబ్ రిజిస్ట్రార్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పలువురు సబ్ రిజిస్ట్రార్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2018 తరువాత ప్రస్తుతం భారీగా సబ్ రిజిస్ట్రార్‌లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ జిఓ 277లో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో 7 నుంచి 10 సంవత్సరాలుగా ఒకేచోట పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్‌లు ఉండడం గమనార్హం.

మొత్తం 73 మంది సబ్ రిజిస్ట్రార్‌లను నవీన్‌మిట్టల్ బదిలీ చేస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. వీరితో పాటు నలుగురు డిజిఐలను బదిలీ చేయడంతో పాటు మరో ఇద్దరూ డిఆర్‌లుగా పనిచేస్తున్న అధికారులకు డిఐజిలకు సైతం పోస్టింగ్‌లను ఇస్తూ జిఓ 275లో నవీన్‌మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. అయితే 73 మంది సబ్ రిజిస్ట్రార్ బదిలీల్లో భాగంగా నిబంధనలను పట్టించుకోలేదని, జోనల్‌కు వ్యతిరేకంగా బదిలీ చేయడంతో పాటు జూనియర్‌లకు సీనియర్ స్థానాన్ని కేటాయించారని పలువురు సబ్ రిజిస్ట్రార్‌లు ఆరోపిస్తున్నారు.

2018లో జరిగిన బదిలీల్లో
2018 సంవత్సరంలో మియాపూర్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తరువాత అప్పట్లో 19 మంది సబ్ రిజిస్ట్రార్‌లను అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజి వాకాటి కరుణ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఆ బదిలీల్లో అవకతవకలు జరిగాయన్న విమర్శలు సైతం వెల్లువెత్తాయి. దీనిపై సిఎంఓ కార్యాలయం సైతం విచారణకు ఆదేశించడం గమనార్హం. త్వరలోనే జూనియర్ అసిస్టింట్, సీనియర్ అసిస్టెంట్, గ్రేడ్ 1 సబ్ రిజిస్ట్రార్‌లకు డిఆర్‌లుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జరిగిన బదిలీలను మరోసారి పునఃపరిశీలించాలని సబ్ రిజిస్ట్రార్‌లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాకు ట్వింకిల్‌కన్నా
ఎస్‌డి ట్వింకిల్‌కన్నా కరీంనగర్ డిఐజి పనిచేస్తుండగా కొత్తగా రంగారెడ్డి జిల్లా డిఐజీగా బదిలీ అయ్యారు. జి.మధుసూదన్ రెడ్డి నిజామాబాద్ డిఐజీగా పనిచేస్తుండగా ప్రస్తుతం కరీంనగర్‌కు, ఎం.సుభాషిణి ప్రస్తుతం మేడ్చల్ మల్కాజిగిరి డిఐజీగా పనిచేస్తుండగా ప్రస్తుతం వరంగల్‌కు, ఎన్.సైదిరెడ్డి వరంగల్ డిఐజీగా పనిచేస్తుండగా ప్రస్తుతం హైదరాబాద్‌కు, కెవి రమేష్‌రెడ్డి నిజామాబాద్ డిఐజిగా, ఎం.రవీందర్ మేడ్చల్ మల్కాజిగిరి డిఐజిగా బదిలీ చేస్తూ నవీన్‌మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News