Friday, December 20, 2024

త్వరలో విద్యుత్ శాఖలో బదిలీలు

- Advertisement -
- Advertisement -

Transfers in the power sector soon

కావాల్సి ప్రాంతానికి బదిలీ కోసం
మంత్రులు అధికారులు చుట్టూ పైరవీలు

మన తెలంగాణ, హైదరాబాద్ : విద్యుత్‌శాఖలో త్వరలో బదిలీల జాతర ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన గైడ్‌లెన్స్‌ను తయారు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో తమకు కావాల్సి ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేయించుకునేందుకు కొంత మంది అధికారులు ఇప్పటి నుంచే సంబంధిత శాఖ మంత్రి చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటే మరి కొంత మంది ఉన్నతాధికారులు, యూనియన్ నాయకులు చుట్టూ తిరుగుతున్నారు. కావాల్సిన ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు కోట్ల రూపాయలను కూడా ఇచ్చేందుకు వెనుకాడటం లేదంటే ఆయా ప్రాంతాలకు ఉన్న డిమాండ్, అదే విధంగా ఆయా ప్రాంతాల్లో వారికి వచ్చే ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్దం చేసుకోవచ్చు. గతంలో ఫోకల్ పోస్టుల కోసం ప్రయత్నించి విఫలమైనవారు ఈ సారి ఎలాగైనా వాటిని దక్కించుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. సాధారణంగా ఫోకల్ పోస్టులంటే అక్కడ అధికారులకు ఆదాయం వచ్చేవని అర్దం. యాజమాన్యం అక్కడపని చేసే అధికారులకు అడ్డు అదపుపు ఉండదు, జిహెచ్‌ఎంసి పరిధిలో తప్ప మిగిలిన ఆపరేషన్ పోస్టులు, కమర్షియల్, హెచ్‌టి మీటర్స్ పోస్టులన్నీ పోకల్ పోస్టులు.

ఈ సారి జరుగుతున్న బదిలీలలో ఎక్కడ ఎన్ని స్థానాలు ఖాళీ అవుతాయనే విషయం తెలియక పోవడంతో ఉద్యోగులు ఫోకల్ పోస్టుల కోసం పైరవీలను ప్రారంభించారు. ఎవరికి ఎక్కడ అవసరం ఉంటే వారు అక్కడ నుంచి తాము కోరుకున్న సీటుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు వివిధ యూనియన్ నాయకుల చుట్టూ విద్యుత్ ఇంజనీర్లు ప్రదక్షణలు చేయడం ప్రారంభించారు. అంగబలం,ఆర్దిక బలం, ఉన్న వారు పోస్టులను దక్కించుకుంటే సత్తాలేని వారు మాత్రం నిస్సాహయంగా చూస్తున్నారు. యాజమాన్యం కూడా బలం ఉన్నవారి వైపు మొగ్గుచూపుతుందని, రికమండ్ చేసేవారు లేక పోయినా, డబ్బులు ఖర్చుపెట్టెవారు లేక పోయినా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో అన్ని ఫోకల్ అయినప్పటికి ఇంజనీర్ల దృష్టి మాత్రం శివారు ప్రాంతాలపైనే ఉంది.

ఇందులో కొన్ని జిహెచ్‌ఎంసి పరిధిలో ఉండగా మరికొన్ని గ్రేటర్ చుట్టూ ఉన్న జిల్లాల పరిధిలోకి వస్తున్నా. శివారు ప్రాంతాల్లో పోస్టులకు అధిక డిమాండ్ ఉండటానికి ప్రధాన కారణంగా అయా ప్రాంతాల్లో ప్రాంతాల్లో ప్రముఖ ఐటీ సంస్థలు, ఉండటం, త్వరలో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే ఉండగా మరికొన్ని జాతీయ,అంతర్జాతీయ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడంతో అక్కడ అభివృద్ది శరవేగంగా ముందుకు సాగే అవకాశం ఉండటం వంటి కారణాలు దీనికి ప్రధానమైనవి. త్వరలో జరగనున్న బదిలీలు అంతా పారదర్శకంగా జరుగుతాయని, ఎటువంటి వత్తిళ్ళకు లోను కాకుండా బదిలీలు జరుగుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News