Monday, December 23, 2024

రాష్ట్రంలో 14 మంది అదనపు కలెక్టర్ల బదిలీలు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : రాష్ట్రంలో 14 మంది అదనపు కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. అదనపు కలెక్టర్లుగా ఐఎఎస్ అధికారులు అపూర్వ్ చౌహాన్ (జోగులాంబ- గద్వాల్), అశ్విని తానాజీ వాకడే (వరంగల్ ) బి.రాహుల్ (మంచిర్యాల), మయాంక్ మిట్టల్ (నారాయణపేట), మంద మకరందు (జగిత్యాల్ ), ప్రఫుల్ దేశాయ్ (జనగాం), అభిషేక్ అగస్త్య ( మేడ్చల్- మల్కాజిగిరి), ఖుష్బూ గుప్తా (నల్గొండ), రాహుల్ శర్మ (వికారాబాద్)కు పోస్టింగ్ చేశారు. అదే విధంగా తదుపరి ఉత్తర్వులకు పరిపాలన విభాగానికి బి.హరిసింగ్, అబ్దుల్ హమీద్, జల్దా అరుణశ్రీ, డి.జాన్ శాంసన్, కందూరి చంద్రారెడ్డిని పోస్టింగ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News