Friday, December 20, 2024

ఎన్నికల నియమాళి ప్రకారం ఉద్యోగుల బదిలీలు

- Advertisement -
- Advertisement -

అక్టోబర్ నుంచి బదిలీలు, పోస్టింగ్‌లు నిషేధం

మన తెలంగాణ / హైదరాబాద్: భారత ఎన్నికల సంఘం నియమాళికి అనుగుణంగా ఉద్యోగులు బదిలీలు ఉండాలని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. అక్టోబర్ 1వ తేదీలోగా ప్రస్తుతం స్ధానంలో ఉన్న అధికారులను ఇతర ప్రాంతాలకు ట్రాన్స్‌పర్ చేయాలని సూచించారు. తరువాత బదిలీలు, పోస్టింగ్‌లు నిషేదం ఉంటుందన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, డిప్యూటీ డిస్ట్రిక్ వంటి ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అదికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అదికారుల వారి పోస్టింగ్ స్దలాల నుంచి బదిలీ చేయాలని సూచించారు. దీర్ఘకాలిక సెలవులపై కొనసాగాలంటే ప్రధాన ఎన్నికల అధికారి అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా తుది ప్రచురణ తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News