Friday, November 22, 2024

పదోన్నతులు లేకుండా టీచర్ల బదిలీలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రెండు మల్టీ జోన్లలోను పదోన్నతులను పక్కన పెట్టి టీచర్ల బదిలీలు పూర్తి చేయాలని తాజాగా పాఠశాలవిద్యాశాఖనిర్ణయించింది. బదిలీల షెడ్యూల్ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా కేసు, టెట్ అర్హత కేసులపై వచ్చిన స్టేను తొలగించడం ఇప్పట్లో అవుతుందో లేదో అనే అనుమానంతో ఎన్నికల షెడ్యూల్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

మల్టీ జో న్ 1లో ఇప్పటివరకు జిహెచ్‌ఎం బదిలీలు పదోన్నతులతో పాటు స్కూల్ అసిస్టెంట్ బదిలీలు కూడా రెండు మేనేజమెంట్లలో ముగిశాయి. షె డ్యూల్ ప్రకారం ప్రస్తుతం స్కూల్ అ సిస్టెంట్ పదోన్నతులు ఇవ్వాల్సి ఉం ది. కానీ ఎస్‌ఎ పదోన్నతులను పక్క న పెట్టి మిగిలిన ఎస్‌జిటి క్యాడర్ ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎస్‌జిటి క్యా డర్ ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎస్‌జిటి తత్సమాన క్యాడర్ బదిలీలకు అక్టోబర్ 3,4 తేదీలలో సీనియారిటీ జా బితాపై అభ్యంతరాలు స్వీకరించి ఈనెల 5న తుది సీనియారిటీ జాబితాలు ప్రకటిస్తారు. 6,7 తేదీలలో వెబ్ ఆప్షన్లు, 8న ఎడిట్ ఆప్షన్ ఇ స్తున్నట్లు తెలిపారు. అలాగే మల్టీ జో న్ 2లో ప్రస్తుతం లోకల్ బాడీ ఉపాధ్యాయులు, ఎస్‌జిటి బదిలీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించారు. అక్టోబర్ 3,4 బదిలీ సీనియారిటీపై అభ్యంతరాల స్వీకరించి, అక్టోబర్ 5న తుది సీనియారిటీ జాబితాలు విడుదల చేస్తారు. అక్టోబర్ 6,7 తేదీలలో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించి, అక్టోబర్ 8న ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నారు. వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకున్న తర్వాత ఖాళీల పాయింట్లు, స్పౌజ్ పాయింట్లలో ఎలాంటి మార్పులుండవని అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News