- Advertisement -
అమరావతి: లోడ్ ఆధారంగా రైతులకు ట్రాన్స్ ఫార్మర్లు అందజేస్తామని ఎపి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వచ్చే సీజన్ కు కొత్త ట్రాన్స్ ఫార్మర్లు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో ఇప్పటికే 22 సబ్ స్టేషన్లకు టెండర్లు పిలిచామని చెప్పారు. గత ప్రభుత్వం 90 శాతం ట్రాన్స్ ఫార్మర్లను ఒకే కంపెనీ నుంచి కొనుగోలు చేసిందని, ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసే ఎంఎస్ఎంఈలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. అవసరం మేరకు కొత్త ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను కొనుగోలు చేస్తున్నామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ట్రాన్స్ ఫార్మర్ల ధరలను 20 శాతానికి పైగా తగ్గించామని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
- Advertisement -