Monday, December 23, 2024

గొంతు కోసుకున్న ప్రేమికులు.. యువతి మృతి, ట్రాన్స్ జెండర్ కు తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: రామకృష్ణాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ట్రాన్స్ జెండర్ మహేశ్వరి, అంజలి అనే యువతి గొంతుకోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని మంచిర్యాల హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే అంజలి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

మహేశ్వరి, అంజలి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని… పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే విద్యానగర్లో ఒకే రూంలో కలిసి ఉంటున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతోనే వాళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు అంజలిని గొంతుకోసి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News