Thursday, January 23, 2025

ఎన్నికల ప్రచార కర్తగా లైలా..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఓటు హక్కు ప్రాముఖ్యత తెలిపేందుకు ఎన్నికల సంఘం వినూత్నంగా ఏర్పాట్లు చేస్తోంది. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే నేపథ్యంలో పోలింగ్ నిర్వహణపై ఎన్నికల సంఘం వేగం పెంచింది. నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభిచారు. ఓటర్ల జాబితా తయారీ, బూత్ కేంద్రాల ఏర్పాట్లపై అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ఎప్పుడు సినీ, క్రీడాకారులను ఎంపిక చేసే ఎన్నికల సంఘం… ఈసారి వినూత్నంగా ఆలోచించింది. ట్రాన్స్‌జెండర్‌ను నియమించింది. ఈ మేరకు వరంగల్ కు చెందిన ట్రాన్స్‌జెండర్ లైలాను ఎంపిక చేసింది. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు ఎలా చేసుకోవాలనే దానిపై ఎన్నికల కమిషన్‌తో కలిసి లైలా ప్రచారం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News