- Advertisement -
తిరువనంతపురం : బాల్యం నుంచి డ్యాన్సు అంటే పరవశించే ట్రాన్స్‌జెండర్ చారులత అనుకోకుండా మలయాళం సినిమాకు మొదటిసారి నేపథ్యగాయినిగా పేరు తెచ్చుకుంది. మొదటి నుంచీ లింగ నిర్ధారణ సమస్యలను ఎదుర్కొనే ఆమె శాస్త్రీయ నృత్యం నుంచి పాటలు పాడే గాయకురాలిగా వెలుగులోకి రావడం విశేషం. నీతి అనే పేరుతో వస్తున్న మలయాళీ సినిమాలో ఆమె రెండు పాటలు పాడింది. ఒకటి సోలో, రెండోది ‘జల్సా’ పాట . జల్సా అన్నది ట్రాన్స్‌జెండర్ సమాజం వారి వేడుకల్లో పాడే పాట. అయితే ఇది ఇప్పటివరకు హిందీ లేదా కన్నడం లోనే ఉంది తప్ప మలయాళం లో లేదు.
- Advertisement -