Sunday, December 29, 2024

టాన్స్‌జెండర్లు ప్రత్యేక కోటాకు అర్హులు: మద్రాస్ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

Transgender eligible for special quota: Madras Court

చెన్నై: సైకియాట్రీ నర్సింగ్ కోర్సుల్లో నర్సింగ్, సర్సింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రత్యేక ట్రాన్స్‌జెండర్ (థర్డ్ జెండర్) కేటగిరి కింద ట్రాన్స్‌జెండర్లు అడ్మిషన్లు పొందడానికి అర్హులని మద్రాస్ హైకోర్టు సూచించింది. ఈమేరకు పిటిషనర్ ఎస్. తమిళ్ సెల్వీని థర్డ్ జెండర్/ట్రాన్స్‌జెండర్‌గా ప్రత్యేక కోటా కింద ఆయా కోర్సుల్లో అడ్మిషన్లకు 2022-23 విద్యాసంవత్సరంలో అవకాశం కల్పించాలని ఆదేశించింది. ఈమేరకు తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం సెక్రటరీకి, వైద్యవిద్య డైరెక్టర్(డిఎంఇ)కి, సెలెక్షన్ కమిటీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం మహిళలు, పురుషుల అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తూ సెలెక్షన్ కమిటీ సెక్రటరీ మెరిట్ లిస్టును జారీ చేశారు. తమిళ్ సెల్వీయే కాకుండా ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి ఎవరైనా ఈ కోర్సుకు దరఖాస్తు చేస్తే ప్రత్యేక కేటగిరి మెరిట్ లిస్టును సెక్రటరీ తయారు చేసి కేవలం ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకే అవకాశం కల్పించేలా చూడాలని, వారికి ఇంటర్ సెక్షన్ మెరిట్‌ను ఆధారంగా పరిగణించాలని జస్టిస్ ఆర్. సురేష్‌కుమార్ వెల్లడించారు.

Transgender eligible for special quota: Madras Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News