- Advertisement -
రూ.30లక్షలు తీసుకుని మాయం
హైదరాబాద్: డబ్బులు తీసుకుని ట్రాన్స్‌జండర్ పరారైన సంఘటన నగరంలోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ట్రాన్స్‌జెండర్ కల్యాణి గత కొంత కాలం నుంచి బోరబండలో ఉంటోంది. కల్యాణితోపాటు మిగతా ట్రాన్స్‌జెండర్లు కూడా ఉంటున్నారు. వారి వద్ద కల్యాణి రూ.30లక్షలు వసూలు చేసింది. ఈ క్రమంలోనే తాను గుంటూరుకు వెళ్తున్నానని మిగతా ట్రాన్స్‌జెండర్లకు చెప్పిన కల్యాణి డబ్బులు తీసుకుని వెళ్లింది. అప్పటి నుంచి తిరిగి రాలేదు. దీంతో మిగతా ట్రాన్స్‌జెండర్లు తమ డబ్బులు తీసుకుని కల్యాణి పరారైందని ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఆర్ నగర్ ఇన్స్‌స్పెక్టర్ సైదులు తెలిపారు.
- Advertisement -