Tuesday, January 21, 2025

డిజిపి ఆఫీసుకు ట్రాన్స్‌జెండర్స్‌…

- Advertisement -
- Advertisement -

Transgender to Telangana DGP Office

హైదరాబాద్: నగరంలోని డిజిపి మహేందర్ రెడ్డి ఆఫీసుకు ట్రాన్స్‌జెండర్స్‌ బుధవారం వెళ్లారు. పోలీస్ ఉద్యోగాల్లో తమకు అవకాశం కల్పించాలని వినతి చేశారు. దరఖాస్తుల్లో పురుషులకు, మహిళలతో పాటు, ట్రాన్స్ జెండర్స్ కోటా ఇవ్వాలని విజ్లప్తి చేశారు. సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పులను కూడా ప్రస్తావించారు. పోలీస్ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన ముచ్చట తెలిసిందే. ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్లు ఇస్తోంది. దీంతో అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు అవకాశం కల్పించాలని ట్రాన్స్ జెండర్స్ కోరుతున్నారు. మరి దీనిపై డిజిపి, రాష్ట్ర ప్రభుత్వం ఎట్ల స్పందిస్తుందో చూడాలి మరీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News