మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్‌లను వలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ పోలీస్ వి భాగంతో పాటు హోంగార్డ్ ప్రస్తుతం సిటీలో వి ధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్ తరహాలోనే ట్రాన్స్ జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ము ఖ్యమంత్రి సూచించారు. ప్రతి నెలా వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి కొంతమేరకు ఉపాధి కల్పించినట్లవుతుందని సిఎం రేవంత్ సూ చించారు. వలంటీరులుగా ఆసక్తిగా ఉన్న ట్రాన్స్ జెండర్‌ల వివరాలను సేకరించాలని ముఖ్య మంత్రి అధికారులకు ఆదేశించారు. వారం, పది రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణ ను కూడా అందించాలని ఆయన చెప్పారు. విధు ల్లో ఉండే ట్రాన్స్‌జెండర్‌లకు ప్రత్యేక యూనిఫాం కూడా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -