Monday, January 20, 2025

ట్రాన్స్ జెండర్లు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలోని ఉన్న ట్రాన్స్ జెండర్లు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అ న్నారు. సోమవారం జిల్లా మ హిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన కార్యక్ర మంలో ముగ్గురు ట్రాన్స్ జెండర్ లకు కలెక్టర్ గుర్తింపు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ఇప్పటికీ 17 మంది ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు అందజేశామని తెలిపారు. గుర్తింపు కార్డుల కోసం జిల్లా సంక్షేమ అధికారి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కరీంనగర్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రతి ట్రాన్స్ జెండర్ ఓటర్ కార్డు కోసం ఫారం 6 నింపి సమీప బిఎల్‌ఓ కు అందజేయాలని సూచించారు.

ప్రభుత్వం నుంచి ట్రాన్స్ జెండర్‌లకు కావలసిన అన్ని సర్టిఫికెట్లను జిల్లా యంత్రాంగం అందజేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్నికల సంఘం ట్రా న్సజెండర్లకు ఓటు హక్కు కల్పించిందని ప్రతి ట్రాన్స్ జెండర్ ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీ స్ కమిషనర్ సుబ్బారాయుడు , డీసీపీ శ్రీనివాస్, ఆర్డిఓ ఆనంద్ కుమార్, ఇంఛార్జి డిడబ్ల్యుఓ సబిత, సఖి సెంటర్ అడ్మిన్ లక్ష్మి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సూపరిండెంట్ ఆర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News