ఎంఎల్‌ఎలదే కీలకపాత్ర
మండలం యూనిట్‌గా అత్యధిక
విద్యార్థులున్న స్కూళ్లకు
ఆధునీకరణలో తొలి ప్రాధాన్యత
మంత్రి హరీశ్‌రావు
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : మార్చి 31నాటికల్లా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు. దళితబంధు పథకం అమలు, కార్యాచరణపై ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లాలోని ఎంపి, ఎంఎల్‌ఎలు, అధికారులతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని కేబినెట్ నిర్ణయించారన్నారు. జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో వంద మంది చొప్పున దళితబంధు పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబాన్ని ఉద్ధరించడమే ప్రభుత్వ లక్షమన్నారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో 100మంది లబ్ధ్దిదారులను ఎంపిక చేస్తున్నామని, వాటిలో ఎంఎల్‌ఎలదే క్రీయశీలక పాత్ర అని పేర్కొన్నారు. రెండు నెలల్లో లబ్ధదారులకు దళితబంధు నిధులు అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మొదటగా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో గ్రామాలను లబ్ధిదారులను ఎంపిక చేయడం, వారి పేరిట దళితబంధు బ్యాంక్ ఖాతాలు తెరిపించడం లబ్ధిదారులు కోరుకున్న యూనిట్‌కు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా లబ్ధిదారులను ఎంపిక చేసి మార్చి 7వ తేదీలోగా లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని మంత్రి సూచించారు.
గ్రామాలను ఎంఎల్‌ఎలుఎంపిక చేస్తారని, తర్వాత అధికారులు గ్రామాలకు వెళ్లి మార్చి7లోగా యూనిట్‌లను గ్రౌండిగ్ చేసేలా చర్యలు తీసుకుంటారని హరీష్ పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎంఎల్‌ఎలే క్రియాశీకంగా వ్యవహరించాలని, రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. లబ్ధిదారులు ఒకే మాదిరిగా కాకుండా వివిధ రంగాలలో తమకు నచ్చిన యూనిట్స్‌ను ఎంపిక చేసుకోవచ్చన్నారు. 10 లక్షల రూపాయలతో ఒకే యూనిట్ కాకుండా.. అవసరాన్నిబట్టి ఒకటికి మించి ఎన్ని యూనిట్లు అయిన లబ్ధిదారుడు పెట్టుకోవచ్చన్నారు. పాడి పరిశ్రమ అయితే లాభదాయకంగా ఉంటుందని, గేదెలకు వంద శాతం ఇన్సురెన్స్ ఉంటుందన్నారు. ఎరువులు, మందుల దుకాణం, బార్ షాప్, మినీ డైరీ యూనిట్, టైలరింగ్, ట్రావెల్స్, ట్రాక్టర్, ట్రాలీ, కోడి పిల్లల పెంపకం, వరి నాటు యంత్రాలు, పవర్ టిల్లర్, షామియానా (టెంట్ హౌస్), కూరగాయాల సాగు, ఐరన్ గేట్స్, గ్రిల్స్ తయారీ యూనిట్, సిమెంట్ ఇటుకలు, డెకరేషన్, లైటింగ్ ఇలా లబ్ధ్దిదారులకు ఇష్టమైన, ఆ రంగంలో అనుభవం ఉన్న వాటిని ఎంపిక చేసుకోవచ్చన్నారు. ఒక్క కుటుంబానికి ఒక్క యూనిట్ మాత్రమే ఇస్తారన్నారు. కలెక్టర్ వద్దకు దళితబంధు నిధులు వచ్చాయని ఎంఎల్‌ఎలు లబ్ధిదారుల జాబితాను ఇవ్వాలని సూచించారు.
తొలి ఏడాదిలో స్కూళ్ళ ఆధునీకరణ
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో పాఠశాలలో నాణ్యమైన విద్యాభోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,280 కోట్లతో మన ఊరుమన బడి ప్రణాళిక అమలుకు కేబినెట్ అమోదించిందని మంత్రి తెలిపారు. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మిగిలి ఉన్న రెండేళ్ళలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలన్నది సిఎం కెసిఆర్ ఆలోచననన్నారు. మొదటి సం వత్సరం మండల కేంద్రానికి యూనిట్‌గా తీసుకొని అత్యధికంగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను తీసుకొని అభివృద్ధి చేయాలని విద్యా శాఖ అధికారులకు మంత్రి సూచించారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని విద్యాశాఖాధికారులకు మంత్రి సూచించారు.
ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన 35శాతం పాఠశాలలకు నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్లు, పెయిం టింగ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్స్, లైట్స్ తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపి బీబీ పాటి ల్, జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు జగ్గారెడ్డి, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, క్రాంతి కిరణ్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ చింతా ప్ర భాకర్, ఎస్‌సి కార్పొరేషన్ ఈడి బాబురావు, వ్యవసాయ శాఖ జెడి నరసింహారావు, హార్టికల్చర్ అధికారి సునీత, జడ్ పి సిఇఓ ఎల్లయ్య, డిఆర్‌డిఓ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.