హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో వివిధ నియోజకవర్గాలకు చెందిన ఓటరు జాబితాను శుక్రవారం పరిశీలకులు బుద్ద ప్రకాష్ పరిశీలించారు. రెండవ సమ్మరీ రివిజన్ లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో జిహెచ్‌ఎంసి పరిధిలో ఓటరు జాబితా (రోల్ అబ్జర్వర్) పరిశీలకులుగా బుద్ధ ప్రకాష్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈఓ) నియమించారు. దీంతో ఆయన సనత్ నగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ముషీరాబాద్, మలక్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా పరిశీలించారు.
అనంతరం బుద్ధ ప్రకాష్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం గా అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో తప్పులు లేని ఓటరు జాబితా తయారు కోసం జిహెచ్‌ఎంసి పరిధిలో ఓటరు జాబితా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. రోల్ అబ్జర్వర్ రిటర్నింగ్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, ఈ ఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.