Monday, January 20, 2025

డ్రైవింగ్ స్కూళ్ళపై రవాణశాఖ అధికారుల ప్రత్యేక నిఘా

- Advertisement -
- Advertisement -

గ్రేటర్ పరిధిలో సుమారు 90కి పైగా కేంద్రాలకు
అనుమతులు లేవని గుర్తించిన అధికారులు

మన తెలంగాణ/ సిటీబ్యూరో : నెల రోజుల్లో డ్రైవింగ్ నేర్పుతాం.. వాటితో పాటు డ్రైవింగ్ లెసెన్స్ కూడా ఇస్తామని చెబుతూ ప్రచారం నిర్వహించుకుంటూ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న డ్రైవింగ్ స్కూళ్ళ నిర్వాహకులపై రవాణాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వీటిలో భాగంగా కొద్ది రోజులు క్రితం డ్రైవింగ్ స్కూళ్ళకు చెందిన వాహనాలను తనిఖీ చేసిన అధికారులు ప్రస్తుతం సదరు డ్రైవింగ్ స్కూళ్ళ ద్వారా డ్రైవింగ్ లెసెన్స్‌లను తీసుకునే అవకాశం లేకుండా చేయనున్నారు. లైసెన్స్‌ల జారీ ప్రక్రియలో కొన్ని సాంకేతిక అంశాలకు సంబంధించి డ్రైవింగ్ స్కూళ్ళ వద్ద వనరులు లేక పోవడమే కాకుండా గ్రేటర్ పరిధిలో సుమారు 90కి పైగా కేంద్రా లకుఅనుమతులు లేవని గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రమాణాలకు అనుగుణంగా లేని వాటిపై కేసులు నమోదు, చేయడమే కాకుండా అనుమతులను కూడా రద్దు చేయన్నారు. గ్రేటర్ రవాణాశాఖ గుర్తింపు పొందినవి డ్రైవింగ్ స్కూళ్ళు 80 ఉండగా అనధికారికంగా 200కు పైగా ఉన్నట్లు అధికారులు అంచాన వేస్తున్నారు. నెల రోల్లో డ్రైవింగ్ పేరుతో 8 వేల నుంచి 10 వేలు వసూలు చేస్తూ ఆర్‌టిఏ జెంట్ల సహయంతో డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్తిసున్నారు. డ్రైవింగ్ స్కూళ్ళ ద్వారా ఆదాయం లాభాసాటి ఉండటంతో అనదంగా కార్లున కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా డ్రైవింగ్ స్కూల్ దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఎన్ని కార్లు ఉన్నాయో స్పష్టంగా పేర్కొనాలి, కాని దరఖాస్తులో రెండు పేర్కొని మూడు నాల్గింటిని తిప్పుతున్నారు.గ్రేటర్‌లో ఉన్న డ్రౌవింగ్ స్కూళ్ళ సుమారు 70 శాతానికి పగా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. నాలుగు కుర్చీలు, మూడు సైన్ బోర్డులు ఉంటే చాలన్నట్లుగా వాటిని నిర్వహకులు నిర్వహిస్తున్నారు.

శిక్షణ ఇచ్చే వాహనాలు కాలపరిమితి దాటనికి కాకుడని (15 సంత్సరాలు) వాహనాలు మాత్రమే శిక్షణకు ఉపయోగించాలి. కాని ఇక్కడ నిర్వాహకులు పాత వాహనాలు మరమ్మతులు చేసి వాటిని శిక్షణకు ఉపయోగిస్తున్నారననే ఆరోపణలు వస్తున్నాయి. వాహనదారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు శిక్షణ ఇచ్చేవారి మెకానికిల్ డిప్లో అర్హత కలిగి ఉండాలి.అంతే కుండా వాహనం శిక్షణ తీసుకునేవారికి నిర్వాహకులు ప్రత్యేకంగా థియరీ తరగతులు నిర్వహించాలి. ఇందుకు ప్రత్యేకంగా క్లాస్ రూమ్‌ను ఏర్పాటు చేయాలి.డ్రైవింగ్ సమయంలో కారు ఆగిపోతే తీసుకోవాల్సిన చర్యలతో పాటు చిన్న చిన్న మరమ్మతులను నేర్పాలి, కార్లలో బ్యాటరీ చెక్ చేసుకోవడం, టైర్లు మార్చుకోవడం, రేడియోటర్ తరచు చెక్ చేసుకోవడం, టైర్లు ప్రషర్‌లో చెక్ చేసుకోవడం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలి. అంతే కాకుండా కొంత సమయం వరకు ప్రత్యక్షంగా సదరు శిక్షకులకు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించాలి . కానీ సదరు నిర్వాహకులు ఇవేమీ పట్టించు కోకుండా లాభార్జనే ధ్యేంగా వ్యవహరిస్తుండటంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News