Wednesday, January 22, 2025

పది మంది ముస్లిం మహిళలను ట్రాప్ చేయాలి: ప్రమోద్ ముతాలిక్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘లవ్ జిహాద్’కు స్పందనగా ఒక్కో హిందూ యువతికి బదులుగా పది మంది ముస్లిం అమ్మాయిలను ట్రాప్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలా చేసే వారికి తాము భద్రత, ఉపాధి కల్పిస్తామని కూడా ప్రకటించారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ముతాలిక్ ప్రసంగించారు.

‘పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. ఈ సందర్భంగా హిందూ యువతను నేను ఆహ్వానిస్తున్నాను. మనం ఒక హిందూ యువతిని నష్టపోతే…కనీసం పది మంది ముస్లిం అమ్మాయిలను ఆకర్షించాలి. అలా చేస్తే శ్రీరామ్ సేన మీ రక్షణ బాధ్యత తీసుకుంటుంది. ఉపాధి కల్పిస్తుంది. లవ్ జిహాద్‌తో మన అమ్మాయిలు దోపిడికి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది బాలికలు ప్రేమ పేరుతో మోసపోతున్నారు. మన చర్యలతో వారిని కట్టడిచేయాలి’ అని ముతాలిక్ వ్యాఖ్యానించారు.

ఉడిపి జిల్లా కర్కాల్ నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు ముతాలిక్ సంకేతాలిచ్చారు. తనపై ఇప్పటి వరకు 109 కేసులు నమోదుచేశారని, అందులో ఎక్కువ బిజెపి హయాంలో దాఖలు చేసినవేనన్నారు. హిందూత్వ విషయంలో తాను స్వంత వారి నుంచే సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News