Wednesday, January 22, 2025

బడులు తెరుస్తామని ట్రస్మా వార్నింగా..?

- Advertisement -
- Advertisement -

TRASMA warning to KCR Govt

మన తెలంగాణ/కరీంనగర్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్టా విద్యాసంస్థల కు సీఎం కేసీఆర్ సెలవులు పొడిగిస్తే ట్రస్మా నాయకులు మూ డు రోజుల్లో విద్యా సంస్థలు తెరుస్తామని వార్నింగ్ ఇచ్చే స్థాయి ట్రస్మాకు ఉం దా అని మాజీ మేయర్ సర్థార్ రవీందర్ సింగ్ మండిపడ్డారు. మంగళవారం కరీంన గర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీందర్ సింగ్ మా ట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలు ఒక్కొక్క విద్యార్థి వద్ద ఫీజుల పేరుతో అనేక దోపిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క విద్యార్థి నుండి 25 వేల నుండి లక్ష 25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని మం డిపడ్డారు. అన్‌లైన్ క్లాస్‌లకు సైతం ముక్కుపిండి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పూర్తిగా ఫీజలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో గెలిపిస్తామని ట్రస్మా పేరుతో అనేక డబ్బులు వసూలు చేసి ఘనత ట్రస్మా నాయకుడికే దక్కిందని అన్నారు. ప్రజా ఆరోగ్యానిన దృష్టా ప్రజలకు రక్షణ కొరకు విద్యాసంస్థలకు సీఎం కేసీఆర్ సెవలవులు పొడగించారని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం జీర్ణించుకోలేవనే ట్రస్మా నా యకులు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలను ట్రస్మా వ్యతిరే కించడం జరికాదని వెంటనే ట్రస్మా క్షమాపచెప్పాల ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సాదావేణి శ్రీనివాస్, కుమార్, గుంజపడుగు హరిప్రసాద్, దండబోయిన రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News