Monday, December 23, 2024

బీబీనగర్ లో ట్రావెల్స్ బస్సు బోల్తా..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని బీబీనగర్ లో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. గురువారం ఉదయం బెంగళూరు నుండి వరంగల్ మీదుగా హైదరాబాద్ ప్రయాణిస్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డులో బోల్తా పడింది.

బస్సులో సుమారు ముప్పై మంది ప్రయనిస్తుండగా అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News