- Advertisement -
- ఒకరు మృతి మరోకరికి గాయాలు
సూర్యాపేట: ప్రైవేట్ ట్రావెల్ బస్సు డీసీయంను డీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరోకరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామం శివారు 65వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
హైదరాబా ద్ నుంచి విజయవాడ వైపు వెళ్లుతున్న డీసీఎంను ఇదే క్రమంలో హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లుతున్న బస్సు అతివేగంతో డీసీఎంను వెనుక నుంచి డీకొట్టింది. ఈ క్రమంలో డీసీయం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఉష్ణం అశోక్ 27 సంవత్సరాలు, అక్కడికక్కడే మృతిచెందగా అనుమాచారికి తీవ్ర గాయాలకు గురైయ్యారు.
మృతుని అన్నయ్య ప్రస్తుతం కిషన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌస్ అధికారి మల్సూర్ విరించారు.
- Advertisement -