Wednesday, January 22, 2025

లారీని వెనుకనుంచి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ట్రావెల్స్ బస్సు లారీని వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో ప్రైవేటు బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తోంది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News