Wednesday, January 22, 2025

రూ.1475కే విమానంలో ప్రయాణం

- Advertisement -
- Advertisement -

Travel by flight for only Rs 1475

ముంబై : భారతదేశం ఈ సంవత్సరం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఎయిర్ ఆసి యా తన కస్టమర్ల కోసం ఆఫర్‌ను ప్రకటించింది. దీంతో ప్రయాణికులు కేవలం రూ. 1475కే విమానంలో ప్రయాణించే అవకాశం కల్గుతుంది. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే ఆగస్టు 13 లోగా ఎయి ర్ ఆసియా దేశీయ విమానాలను బుక్ చేసుకోవాలి. అంతర్జాతీయ విమానాలకు ఈ ఆఫర్ వర్తించదు. ఈ ఆఫర్ కింద ప్యాసింజర్ల ప్రయాణం 2022 ఆగస్టు 25 నుండి 2023 మార్చి 31 మధ్య ఉండాలి. ఎయిర్ ఆసియా అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఈ ప్రకటన చేసింది. 75వ స్వాతంత్య్ర సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్‌ను తీ సుకువచ్చామని వెల్లడించింది. కేవలం రూ. 1,475తో విమానాల్లో ప్రయాణించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News