ప్రయాణికులకు సూచించిన మెట్రో
మనతెలంగాణ/హైదరాబాద్: మెట్రో రైళ్లలో ప్రయాణించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతూ మెట్రో అధికారులు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు బ్రహ్మానందం వీడియోను మీమ్ చేస్తూ అధికారులు ట్వీట్ చేశారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.ఈ నేపథ్యంలోనే నగరంలో కురిసిన వర్షాలపై మెట్రో వినూత్నంగా స్పందించింది. మెట్రోలో ప్రయాణించే వారికి హైదరాబాద్‌లో వర్షం పెద్ద ఇబ్బందేమి కాదని, ట్రాఫిక్‌ను బాధలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు పడకుంగా క్షేమంగా మెట్రోలో జర్నీ చేయాలని మెట్రో సూచించింది. దీంతోపాటు ఈ ట్వీట్‌కు బ్రహ్మనందం వీడియోను జత చేస్తూ, అయ్యో ట్రాఫిక్‌లో చిక్కుకు పోవాల్సిందే అని సహోద్యోగి బాధ పడుతుండగా మెట్రోలో వెళ్లు నేను ఇలా నవ్వుకుంటాను అంటూ బ్రహ్మానందం వీడియోతో మీమ్ చేసి మెట్రో ఈ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hyderabad rains are no match for your commute when you choose the Metro. Stay dry, avoid traffic, and breeze through your journey hassle-free.#landtmetro #HyderabadMetro #MetroRail #metrostation #skipthetraffic #metromoments #TimeOfYourLife #HyderabadRains pic.twitter.com/IcRaAougGs
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) May 16, 2024