Monday, December 23, 2024

ట్రావెల్ వ్లాగ్ వెబ్‌సైట్ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

Travel Vlog website was launched by Srinivas Gupta

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలతో పాటు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు, కళ, వంటకాలు, వన్యప్రాణులు, ప్రకృతికి సంబంధించిన వివిధ అంశాలను ప్రజలకు తెలియచేయడానికి రూపొందించిన ట్రావెల్ వ్లాగ్ వెబ్‌సైట్‌ను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌గుప్తా శుక్రవారం ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌లో పర్యాటకులకు కావాల్సిన విషయాలు, ఆయా ప్రదేశాలకు ఎలా వెళ్లాలి, అక్కడ చూడాల్సిన ప్రదేశాలు, చరిత్ర, ఉండాల్సిన ప్రదేశాలు, అక్కడి కార్యకలాపాల గురించి ఈ వెబ్‌సైట్లో పొందుపరిచారు. ఈ వెబ్‌సైట్ ఆవిష్కరణలో టూరిజం ఎండి మనోహర్‌రెడ్డి, ఈడి శంకర్‌రెడ్డి, జిఎం శాంతి, నాథన్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వెబ్‌సైట్‌ను దాని కంటెంట్‌ను శ్రీరామ కృష్ణ కల్యాణం అనే సంస్థ అభివృద్ధి చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News