Saturday, November 23, 2024

మురుగు నీటిలో ప్రయాణం నరకం

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి రూరల్ : కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లికల్ రోడ్డు అధ్వాన్నంగా మారింది. మున్సిపాలిటీ మురికి నీరు మొత్తం రోడ్డుపై పారుతుండడంతో దుర్గంధం వెదజల్లుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్డుపై పారుతున్న మురికి నీరులో ప్రయాణం నరకమని ప్రయాణికులు పేర్కొంటున్నారు.

కల్వకుర్తి పట్టణం నుంచి ఆ రోడ్డుపై ఎల్లికల్, జంగారెడ్డిపల్లి, రంగాపూర్, తిమ్మరాసిపల్లి తదితర గ్రామాల మీదుగా ఉప్పునుంతల, అచ్చంపేటకు ఈ రోడ్డుపైన ప్రయాణిస్తున్నారు. ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

అధ్వాన్నంగా అంతర్గత రోడ్లు…
కల్వకుర్తి మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. పలు కాలనీల్లో జనాలు బురద, మురికి నీటితో కంపు వాసనలో ఉండాల్సి వస్తోంది. విద్యానగర్ కాలనీలో అంతర్గత రోడ్లు అడుగుకో గుంత ఏర్పడి నడకే నరకంగా మారింది. వాహనాలపై వెళ్లే వారికి ఇబ్బందిగా మారింది. పట్టణంలోని బచ్చన్ స్కూల్ సమీపంలో అంతర్గత రోడ్డు అధ్వాన్నంగా మారి గుంతల మయంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News