Sunday, December 22, 2024

ఇఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద ట్రావెల్స్ బస్సు బీభత్సం

- Advertisement -
- Advertisement -

ఎర్రగడ్డ: హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సమీపంలో ఇఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద శనివారం ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. గో టూర్ ట్రావెల్స్ బస్సు  అదుపుతప్పి ముందున్న కారును ఢీకొట్టి అనంతరం ఈడ్చుకెళ్లింది. గో టూర్ ట్రావెల్స్ బస్సు దూసుకురావడంతో వాహనదారులు, పాదాచారులు పరుగులు తీశారు. బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తుక్కుతుక్కుగా మారింది. వాహనదారులు, జనం కేకలు వేయడంతో కారులో నుంచి డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంతో పాటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News