Thursday, January 23, 2025

ట్రావిస్ హెడ్ వచ్చేశాడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మరో కొన్ని రోజుల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. మార్చి 22న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఐపిఎల్ 17వ సీజన్ ఫురూ కానుంది. దీంతో ఆయా ఫ్రాంచైజీల ఆటగాళ్లు జట్టులో చేరుతున్నారు. ఇప్పటికే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టులో చేరగా.. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిశాడు.

ఈ సిజన్ కోసం ఆదివారం ట్రావిస్ హెడ్ హైదరాబాద్ వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అయ్యాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హెడ్ కూడా వారితో కలిశాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా రేపో మాపో ఎస్‌ఆర్‌హెచ్‌తో కలవనున్నాడు. ఇక గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ 2023ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. భారత్‌తో జరిగిన ఫైనల్లో సెంచరీతో చెలరేగాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News