Friday, December 27, 2024

నాన్న అడుగుజాడల్లో నడుస్తున్నా…

- Advertisement -
- Advertisement -

రాహుల్‌ను ప్రధానిగా చూడాలి
పార్టీ విలీనం సందర్భంగా వైఎస్ షర్మిల
కాంగ్రెస్ కండువాను తిరస్కరించిన అనిల్

వైఎస్‌ఆర్‌టిపిని కాంగ్రెస్‌లో విలీనం చేసిన అనంతరం వై.ఎస్ షర్మిల

మనతెలంగాణ/న్యూఢిల్లీ: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీ లోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే,ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాం గ్రెస్ కండువా కప్పుకున్నారు. బుధవారం తాడేపల్లిలో తన అన్న ఏపి సిఎం జగన్‌ను కలిసిన అనంతరం అటు నుంచి అటే నేరుగా ఢిల్లీకి చేరుకున్న షర్మిల తనతోపాటు తన భర్త బ్రదర్ అనిల్ కుమార్‌తో కలిసి గురువారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటి అయ్యారు.వైఎస్‌ఆర్‌తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌పార్టీలో విలీనం చే స్తున్నట్టు ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే షర్మిలకు పార్టీ కండువా కప్పారు. షర్మిల భర్త అనిల్‌కు కూడా ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పేందుకు ప్రయత్నించగా అనిల్ సున్నితంగా తిరష్కరించారు. షర్మిల కల్పించుకుని ఖర్గేకు ఎదో సర్దిచెప్పగా ఆయన నవ్వుతూ మిన్నకుండి పోయారు. అనంత రం పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా షర్మిల మెడలో కాంగ్రెస్ కండువా వేశా రు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చే యడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి కాంగ్రెస్ లో వైటీపీ ఒక భాగమని చెప్పారు. దేశం లోనే అతి పెద్ద పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ అని వెల్లడించారు. వైఎస్సార్ తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశారని చెప్పారు. మా నాన్న అడుగు జాడల్లోనే నడుస్తున్నాని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం తన తండ్రి కల అన్నారు. రాహుల్ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని చెప్పారు. జోడో యాత్ర ప్రజలతో పాటు తనలో కూడా విశ్వాసాన్ని నింపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలషర్మిల కూడదనే ఎన్నికల్లో పోటీ చేయలేదని స్పష్టం చేశారు. పార్టీ విలీన కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ ఏపి వ్యవహరాల ఇంచార్జి మాణిక్కం ఠాకూర్, కేసి వేణుగోపాల్, ఏపి పిసిసి అధ్యక్షుడు గిడు గు రుద్ర రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం షర్మిల దంపతులు కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత సోనియాగాంధీని కలిశారు. అమె ఆశీర్వాదం తీసుకున్నారు.
ఏపీలో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం : మాణిక్కం ఠాకూర్
షర్మిల కాంగ్రెస్‌పార్టీలో చేరటంతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీకి పునరుజ్జీవం వచ్చిందని కాంగ్రెస్‌పార్టీ ఏపి వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాకూర్ అన్నారు. ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ షర్మిల రాకతో పార్టీ ఏపిలో బలోపేతం అవుతుందన్నారు. పార్టీలో ఆమెకు ఏ పదవి కట్టబెట్టాలో త్వరలోనే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. పార్టీలో చేరికతో ఇక కాంగ్రెస్ ఏపి మిషన్ ప్రారంభమైందన్నారు. ఏపిలో బిజేపికి ప్రాంతీయ పార్టీలన్నీ అనుకూలమే అని ఆరోపించారు. రాష్ట్రానికి బిజేపి తీరని ద్రోహం చేసిందన్నారు.
పిసిసి పదవి పోయినా బాధలేదు : గిడుగు
వైఎష్ షర్మిల కాంగ్రెస్‌పార్టీలో చేరిక వల్ల తన పిసిసి పదవి పోయినా తనకు ఏమాత్రం భాధ వుండదని ఏపి పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఢిల్లీలో రుద్రరాజు మీడియాతో మాట్లడుతూ షర్మిల రాకవల్ల పార్టీకి బలం పెరిగిందన్నారు. రాహుల్‌ను ప్రధాని చేసేందుకే షర్మిల కాంగ్రెస్‌పార్టీలో చేరినట్టు తెలిపారు. ఇక నుంచి షర్మిలతో కలిసి టీమ్ వర్క్‌గా పనిచేస్తామన్నారు. ఆమెకోసం తన పదవిని సైతం వదులుకుంటానన్నారు. ఇంకా చాలమంది నేతలు కాంగ్రెస్‌లో చేరతారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీని , కేంద్రంలో బిజేపిని ఓడించటమే తమ లక్షం అని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలు రాహుల్ యాత్రపై తాము దృష్టి పెట్టామని పిసిసి నేత గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News