Wednesday, January 22, 2025

గుప్త నిధుల కోసం రామప్ప గొల్లాల గుడిలో శిల్పాలు ధ్వంసం

- Advertisement -
- Advertisement -

ములుగు జిల్లాలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ పరిధిలోని ఉప ఆలయమైన గొల్లాల గుడి గుప్తనిధుల కోసం గుర్తు తెలియని దుండగుల చేతిలో ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే ..ఆదివారం మధ్యాహ్నం పురావస్తు శాఖ సిబ్బంది గొల్లాల గుడి ఆలయాన్ని శుభ్రం చేయడానికి వెళ్ళగా పైకప్పు తీసి కింద పడేసి నిచ్చెన ద్వారా దుండగులు లోపలికి దూరినట్లు గుర్తించారు. ఆలయం లోపల శివలింగంతో పాటు శిల్పాలను దుండగులు పడగొట్టారు. గుర్తు ఆలయం లోపల పువ్వు ఆకారంలో ఉన్న శిల్పాన్ని పగులగొట్టి పక్కకు పడేశారు. దాని కింద గుప్తనిధులు ఉన్నాయని అనుమానంతో పగులగొట్టినట్లు తెలుస్తోంది.

కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న గొల్లాల గుడి శిథిలావస్థలో ఉండగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రెండేళ్ల క్రితం ఆయంలోని శిల్పాలతో పాటు శివలింగాన్ని పునరుద్ధరించారు. దేవాలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గేటుకు తాళం వేసి ఉంచుతున్నారు. ఆలయంలో ధూప దీప నైవేద్యాలు లేనప్పటికీ ఆలయం చుట్టూ పిచ్చిమొక్కలు తొలగించి వచ్చే భక్తులు దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. కానీ ఆలయాన్ని భక్తుల దర్శనానికి పురవస్తు శాఖ అనుమతించడం లేదు. ఈ విషయంపై స్థానిక ఎస్‌ఐ జక్కుల సతీష్‌ను సంప్రదించగా పురావస్తు శాఖ సిబ్బంది ఆదివారం సాయంత్రం వచ్చి ఫిర్యాదు చేశారని, దర్యాప్తు చేసి దుండగులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News