Tuesday, December 3, 2024

దీపావళి వేడుకలు… సరోజిని ఆస్పత్రిలో చేరిన బాధితులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దీపావళి వేడకలు తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. టపాసులు దుకాణాలు పిల్లలు, పెద్దలతో కిక్కిరిసిపోయాయి. పిల్లలు, యువకులు, పెద్దలు పటాకులు పేల్చుతూ ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ నగరంలో కొందరు బాణసంచా పేల్చుతూ గాయపడ్డారు. పటాకులు పేల్చుతూ గాయపడిన వారు సరోజిని దేవి కంటి ఆస్ప్రత్రి చేరుకున్నారు. సరోజిని కంటి ఆస్పత్రికి 45 మంది బాధితులు వచ్చారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 35 మంది స్వల్పంగా గాయపడగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారని పరీక్షించిన వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. గత సంవత్సరం 50 మంది పైగా గాయపడిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ సందర్భంగా భారీగా బాణసంచా కాలువడంతో తీవ్రంగా వాయు కాలుష్యం భాగా పెరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీపావళి రోజున నగర ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారని వైద్యులు చెబుతున్నారు. దీపావళి రోజున చేసే వాతావారణ కాలుష్యంతో వారం రోజుల పాటు నగర ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News