Monday, January 20, 2025

మంత్రి కొండా సురేఖ ఔదార్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించనుంది. ఇందుకోసం మంత్రి కొండా సురేఖ చేసిన కృషి ఫలితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని హామినిచ్చారు. వివరాల్లోకి వెళితే హన్మకొండ జిల్లాలోని రెడ్డి కాలనీకి చెందిన మొహమ్మద్ నసిమ్, అహమద్ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. చిన్న అబ్బాయి మొహమ్మద్ ఆదిల్ అహమద్ కొంత కాలంగా బొన్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు.. లక్షల్లో వైద్యం చేయించలేక పేదరికంతో బాధపడుతున్న ఆ కుటుంబం మంత్రి కొండ సురేఖను కలిసి వారి భాదను ఏకరుపెట్టింది. చలించిపోయిన మంత్రి కొండ సురేఖ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి సమస్య తీవ్రతను తెలియజేశారు. వెనువెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు చెప్పి వారికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు.

పేద ప్రజల వైద్యానికి మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆపదలో ఉన్న రోగులను ఆదుకునేందుకు అన్ని విధాల అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మన ప్రభుత్వం పని చేస్తుందని ఆర్ధిక స్థోమత కారణంగా ఎవరు దిగులుపడవద్దని వారికి మన ప్రజా ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డి అండగా ఉన్నారని మంత్రి సురేఖ భరోసానిచ్చారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ప్రజా వైద్య సమస్యల దృష్ట్యా ఆరోగ్య శ్రీ 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News