Sunday, December 22, 2024

గంజాయి వ్యసనాన్ని నిరోధించే కొత్త ఔషధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గంజాయి మత్తుకు బానిసైన వారికి చికిత్సలో సమర్ధంగా ఉపయోగపడే కొత్త ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జంతువుల పైన మనుషులపైన ఈ ఔషధ ప్రభావం ఏవిధంగా ఉంటుందో ప్రయోగాలు చేశారు. సానుకూల ఫలితాలు రావడంతో నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ఆ వివరాలు వెలువరించారు. గంజాయి మత్తుకు దోహదం చేసే కనబినాయిడ్ గ్రాహకాన్ని ఈ ఔషధం ఉపసంహరణ లక్షణాలను ప్రేరేపించకుండా నిరోధిస్తుంది. ఈ మేరకు జంతువులపై ప్రయోగాల వివరాలు, మనుషులపై మొదటి, రెండు దశల క్లినికల్ ట్రయల్స్ డేటా ఆధారంగా జర్నల్‌లో వివరాలు వెల్లడించారు. గంజాయి లోని ప్రధాన సైకోయాక్టివ్‌భాగం టెట్రాహైడ్రోకెనబినాల్ (టిహెచ్‌సి) గంజాయి లోని కనబినాయిడ్ గ్రాహకాన్ని ప్రేరేపిస్తుందని గత పరిశోధనల్లో కనుగొన్నారు. గంజాయి మత్తు దీనివల్లనే కలుగుతుందని తెలుసుకున్నారు.

ఫ్రాన్స్‌కు చెందిన ఎయిలిస్ ఫార్మా లోని పైయర్ విన్సెంజో ప్లాజా పరిశోధకులు ఈ కొత్త ఔషధాన్ని కనుగొన్నారు. ఈ ఔషధం కనబినాయిడ్ గ్రాహకాన్ని నిరోధిస్తుంది. ఇదివరకటి పరిశోధనల్లో కనబినాయిడ్ గ్రాహకం చురుకుగా ఉండడానికి గంజాయి లోని ప్రధాన సైకోయాక్టివ్ భాగం టెట్రాహైడ్రోకెనబినాల్ ప్రధాన కారణమని తెలుసుకున్నారు. దానివల్లనే గంజాయి వల్ల కలిగే విపరీత లక్షణాలు ప్రభావం చూపుతుంటాయని పరిశోధనల్లో తేలింది. ఇప్పుడు కనబినాయిడ్ గ్రాహకం వల్ల ప్రేరణపొందే పరమాణు మార్గాలను ఈ కొత్త ఔషధం నిరోధించగలుగుతుంది. టెట్రాహైడ్రోకెనబినాల్ ప్రవర్తనా ప్రభావాలను కొత్త ఔషధం నివారిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ ఔషధాన్ని 64 మంది ఆరోగ్యవంతులైన వారిపై ప్రయోగించగా ఎలాంటి చెడుఫలితాలు కనిపించలేదు. అందువల్ల ఈ ఔషధం వల్ల రక్షణ కలుగుతుందన్న నమ్మకం కుదిరింది.

గంజాయి వ్యవసనానికి యువత ముఖ్యంగా విద్యార్థులు బానిసలవుతున్నారు. గంజాయి అక్రమంగా రవాణా చేసి సులువుగా డబ్బు సంపాదించాలన్న తాపత్రయంతో గంజాయి రవాణా కూడా చాలా మంది యువకులు, విద్యార్థులే సాగిస్తుండడం విశేషం. విశాఖ ఏజెన్సీలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. పోలీస్‌లు ఎన్నిసార్లు పట్టుకున్నా ఈ అక్రమాలు మాత్రం చాపకింద నీరులా సాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News