Thursday, November 21, 2024

బాలునికి ఫేవిక్విక్‌తో ట్రీట్ మెంట్.. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం

- Advertisement -
- Advertisement -

అయిజ : ప్లాసిక్ వస్తువులు విరిగిపోతే వాడవలసిన ఫేవిక్విక్‌ను డాక్టర్‌లు బాలుడి చికిత్స కోసం ఉపయోగించారు. ఈ వింత వైద్యం జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ కేంద్రానికి చెందిన వంశీ కృష్ణ, సునీత దంపతుల కుమారుడు ప్రణవ్ చౌదరి గురువారం రాత్రి ఎడమ కనుబోమ్మపై గాయం కాగా రక్త స్రావం అవుతుండడంతో రేయిన్‌బో చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకుని వేళ్ళారు. డాక్టర్ గాయానికి మందులను ఉపయోగించి వైద్యం చెయ్యవలసి ఉండగా ఫేవిక్విక్‌ ఉపయోగించారు.

ఆ నొప్పి భరించలేక బాలుడి ఏడ్పును గమనించిన తల్లిద్రండులు వైద్యానికి బయోసిన్ ఉపయోగించాలి కాని ఫేవికిక్ ఎలా ఉపయోగిస్తారని వైద్యులను నిలదీశారు. ఏ అధికారి ఏమి చెయ్యలేరని నోటిస్ ఇస్తారు అంతే కదా బాలునికి వైద్యం ఖర్చులకు డబ్బులు ఇస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు ఆస్పత్రి వైద్యుడు. దిక్కు తోచని స్థితిలో తమ కుమారుడిని పట్టణ కేంద్రంలో మరో ఆస్పత్రికి తీసుకుని వెళ్ళగా అక్కడి డాక్టర్ పరిశీలించి గాయానికి ఫేవిక్విక్‌ను ఉపయోగించారని నిర్ధారించారు. ఈ ఘటనపై శుక్రవారం స్థానిక పోలీస్టేషన్‌లో ఎస్‌ఐ నరేష్‌కు ఫిర్యాధు చేశారు. తమ కుమారుడికి ఏదైన ప్రమాదం జరిగితే రేయిన్ బో ఆస్పత్రే పూర్తి బాధ్యత వహించాలని ఉన్నత అధికారులు ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News