Tuesday, January 21, 2025

కంటోన్మెంట్ ఆస్పత్రిలో రోగులపై కూలిన చెట్టు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని బొల్లారంలో కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులపై చెట్టు కూలడంతో ఒకరు మృతి చెందారు. ప్రవేశ ద్వారం వద్ద దంపతులు రవీందర్-సరళాదేవిపై చెట్టు కూలడంతో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స కోసం ఆస్పత్రికి దంపతులు వచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో భారీ గాలులు వీస్తుండడంతో చెట్లు కూలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎత్తుగా పెరిగిన చెట్ల కొమ్మలు నరికిస్తే బలమైన గాలులు వీచినప్పుడు కూలిపోకుండా ఉంటాయి. ఇప్పటికైనా జిహెచ్ఎంసి సిబ్బంది కొన్ని చెట్ల కొమ్మలను నరికిస్తే బాగుంటుందని స్థానికులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News