Tuesday, November 5, 2024

ఈ ఏడాది హిమాన్షుకు ఎంతో గొప్పది: సంతోష్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఈ రోజు తన పుట్టిన రోజును పురస్కరించుకొని తన బాబాయి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రగతి భవన్ లో మంత్రి కెటిఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా హిమాన్షు మాట్లాడుతూ…. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితహారం కార్యక్రమం లో అందరు కూడా భాగస్వాములై మొక్కలు నాటాలని, దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.

ఈ సంవత్సరం హిమాన్షుకు ప్రత్యేకమైన జన్మదినం : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్

తాను దత్తత తీసుకున్న రెండు గ్రామాల్లో కల్తీ లేని ఆహారం కోసం గొప్ప కార్యక్రమం చేపట్టడంతో పాటు విజయవంతంగా అమలు చేసినందుకు జాతీయ స్థాయిలో డయానా అవార్డు హిమాన్షుకు రావడం జరిగిందని, ఈ సంవత్సరం ఎంతో గొప్పది అని జోగినిపల్లి ప్రశంసించారు.

అదే విధంగా తన పుట్టినరోజు సందర్భంగా తనతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం చాలా సంతోషకరమైనదన్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీస్సులు అందిస్తున్నానని తన బాబాయి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News