Monday, December 23, 2024

చెట్లు మనుషులతో సమానం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : పుట్టిన రోజు సందర్భంగా , ఇతర ముఖ్యమైన రోజులలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో సోమవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామం ఆవరణంలో మొక్కలను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు మహబూబ్‌నగర్‌లో 500 గజాల పార్కు ఉండేది కాదని, అలాంటిది ఇప్పుడు దేశంలోనే అతి పెద్దదైన 2087 ఎకరాల విస్తీర్ణం కలిగిన కెసిఆర్ ఎకో అర్భ న్ పార్క్ ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ముఖ్యంగా విద్యార్థులు వారి పుట్టిన రోజు సందర్భంగా తప్పనిసరిగా మొక్కలు నాటి సంరక్షించాలని, అదే విధంగా తల్లిదండ్రులతో మొక్కలు నాటించాలని వారితో ప్రతిజ్ఞ చేయించారు. కెసిఆర్ ఎకో అర్భన్ పార్క్‌లో జంగిల్ సఫారీని ప్రారంభించామని, అంతేకాకుండా ఈ పార్కులో ఎన్నో రకాల అడ్వెంచర్స్ అవకాశాలు కల్పించామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిలో భాగంగా ప్రత్యేకించి మహబూబ్‌నగర్ మున్సిపాల్టీలో శిల్పారామం, మినీ ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్ వంటి వాటిని చేపట్టడం జరిగిందని, ఒకప్పుడు ఈ ప్రాంతాలన్నీ అత్యంత దుర్గంధంగా ఉండేవని, వాటిని సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రదేశంగా మలచామని మంత్రి పేర్కొన్నారు.

వీటన్నిటినీ విద్యార్థులకు ఉచితంగా తిలకించే ఏర్పాటు చేస్తామన్నారు. రెండు నెలల్లో సస్పెన్షన్ బ్రిడ్జి, మినీ ట్యాంక్ బండ్ అన్ని పనులు పూర్తవుతాయని అన్నారు. ఒకప్పుడు మహబూబ్‌నగర్ లో తాగడానికి సైతం మంచినీరు దొరికేది కాదని, అలాంటిది ఇప్పుడు పట్టణాన్ని అన్ని రకాలుగా అ భివృద్ధి చేస్తామని తెలియజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా మహిళలు తయారు చేసిన విత్తన బంతుల వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వి ద్యార్థులకు, అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని జ్ఞాపికలతో సన్మానించారు. జిల్లా పరిషత్ చైర్ ప ర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ రాకముందు పూర్తిగా వెనుకబడిపోయి ఉండేదని, అలాంటిది ఇప్పుడు ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు.

ప్రత్యేకించి కెసిఆర్ ఎకో అర్భన్ పార్కును బయటి నుంచి వచ్చిన వారు సైతం అభినందిస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కార్యక్రమం కింద 7కోట్ల మొక్కలు నాటడం జరిగిందని, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని, అంతేగాక నాటిన మొక్కలను సంరక్షించాలని పిలుపునిచ్చారు.

రెవె న్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రా జేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్షితిజ, డిఎఫ్‌ఓ సత్యనారాయణ, డిఆర్డిఓ యాదయ్య, ఇండియన్ రెడ్‌క్రాస్ జి ల్లా అధ్యక్షులు లయన్ నటరాజ, ఎకో క్లబ్ అధ్యక్షులు గన్నోజు చంద్రశేఖర్, ఇతర జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరితహారంపై అడవు ల అభివృద్ధిపై రాష్ట్ర స్థాయిలో రూపొందించిన, అ లాగే జిల్లా స్థాయిలో రూపొందించిన చిత్ర ప్రదర్శనను తిలకించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News