Sunday, November 3, 2024

భవిష్యత్ తరాల కోసం మొక్కలు పెంచాలి: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Trees are planted for future

హైదరాబాద్: భవిష్యత్ తరాల కోసం మొక్కలు పెంచాలని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలిసారి మొక్కల పెంపకంపై సమీక్ష చేశానని గుర్తు చేశారు. హరితహారంపై శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. 1978 నుంచి 2050 వరకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కార్యక్రమంతో గోబీ అనే ఏడారిలో ఐదు వేల కిలో మీటర్ల మేర మొక్కలు పెంచుతున్నారని గుర్తు చేశారు. బ్రెజిల్‌లో అమెజాన్ అడవుల పరిరక్షణ అభినందనీయమన్నారు. గతంలో హైదరాబాద్‌లో స్వచ్ఛమైన నీళ్లు లభించేవని, వనాల మధ్య నుంచి నీరు పారడం ద్వారానే అధి సాధ్యమైందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 2.78 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉందని రికార్డులు ఉన్నాయని, అటవీ ప్రాంతాలు చాలా వరకు మాయమైపోయాయని, వేర్ల ద్వారా తిరిగి అడవిని పునరుజ్జీవం చేయొచ్చని కెసిఆర్ తెలిపారు.

1987లో సిద్దిపేటలో పది వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, పది వేల మొక్కలు సమీకరించుకోవడానికి ఎంతో కష్టాపడాల్సి వచ్చిందని సిఎం గుర్తు చేశారు. ఇప్పటికే 20.23 కోట్ల మొక్కలు నాటామని, సిద్దిపేటలో 35 వేల ఎకరాల్లో అడవీ విస్తీర్ణం పెరిగిందన్నారు. నిర్మల్‌లో మంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టి అడవులు పెంచారని, మొక్కలు పెంపకానికి కృషి చేస్తున్న అధికారులకు అభినందనలన్నారు. 80 కోట్ల మొక్కలను వేర్ల ద్వారా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 42.42 కోట్ల మొక్కలను వేర్ల ద్వారానే పెంచామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 60.6 కోట్ల మొక్కలను పెంచుతున్నామన్నారు. ఇప్పటి వరకు హరితహారం కింద రూ.6556 కోట్లు ఖర్చు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News