Wednesday, January 22, 2025

మనిషి మనుగడకు చెట్లే ఆధారం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే క్రాంతికిరణ్

జోగిపేట: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా జోగిపేట మున్సిపల్ పరిధిలోని జోగిపేట ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకొని క్రీడా మైదానంలో మొక్కలు నాటారు. అనంతరం మైదానంలో నూతనంగా నిర్మించిన వాకింగ్ ట్రాక్‌ను ఆయన ప్రారంభించారు. ట్రాక్ వెంట వరుసగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి మనుగడకు చెట్లే ఆధారమన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడం ఛాలెంజ్‌గా తీసుకొవాలన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి ఇప్పటి నుంచే యుద్ద ప్రాతిపదికన హరితహారం చేపట్లాలని సూచించారు.

డాకూర్ గ్రామంలో… అందోల్ మండల పరిధిలోని ప్రతి గ్రామంలో సర్పంచ్‌లు, కార్యదర్శులు కలిసి కట్టుగా హరితహారం చేపట్టారు. డాకూర్ ఎంపిడిఓ పాల్గొన్నారు. డబుల్‌బెడ్‌ల వద్ద హరితహారం కార్యక్రమం చేపట్టారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పది ఆకారంలో మొక్కలు నాటారు. ఇందులో ఎంపిపి అధ్యక్షుడు, సర్పంచ్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News